English | Telugu

జపాన్ సునామి బాధితులకు సూపర్ స్టార్ రజనీ కాంత్ సాయం

జపాన్ సునామి బాధితులకు సూపర్ స్టార్ రజనీ కాంత్ సాయం అందించనున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ కి జపాన్ లో కాస్త ఎక్కువగానే అభిమానులున్నారు. ఇటీవల జపాన్ లో జరిగిన సునామీ, భూకంపం, అగ్నిపర్వతం ప్రేలుళ్ళు, అణు రియాక్టర్ల ప్రేలుళ్ళు జరిగి, అక్కడి ప్రజలు ఆపదలో ఉన్న సందర్భంగా వారి పరిస్థితి ఏమిటనేది సూపర్ స్టార్ రజనీ కాంత్ జపాన్ లోని తన అభిమానులతో మాట్లాడి తెలుసుకున్నారు. సాటి మనిషిగా జపాన్ ప్రజలు పడుతున్న బాధలకు సూపర్ స్టార్ రజనీ కాంత్ మనసు కదిలిపోయింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాను జపాన్ లోని ఈ సునామీ బాధితులకు, భారీ ఎత్తున వస్త్రాలనూ, ఆహారపు దినుసునులనూ, వంట సామగ్రినీ, అనేక వస్తు సామాగ్రినీ ఒక ప్రత్యేక విమానంలో జపాన్ కి పంపించటానికి తనకు ఒక విమానం కావాలని వెంటనే భారత్ ప్రభుత్వంతో మాట్లాడారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ చేస్తున్న ఈ మంచి పనికి భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ పనికి విమానం ఇవ్వటానికి అంగీకరించింది. హేట్సాఫ్ రజనీ. కీపిటప్. అలాగే సాటి మనుషులుగా మనం కూడా ఎవరికి తోచిన సాయం వారు జపాన్ లోని ఈ సునామీ బాధితులకు చేసి మానవత్వాన్ని బ్రతికిద్దాం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.