Read more!

English | Telugu

రాజమౌళి సామ్రాట్ అశోక తీస్తున్నాడా..?

ఇప్పుడున్న తెలుగు దర్శకుల్లో అగ్రస్థానం ఎవరిది అంటే, డౌట్ లేకుండా రాజమౌళిదే అని చెబుతారు ఎవరైనా. సినిమా జానర్ ఏదైనా అద్భుతంగా తెరకెక్కించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. బాహుబలి తర్వాత ఆయన ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ఈగతోనే మంచి దర్శకుడని బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రాజమౌళి ఫేమ్ ను బాహుబలి మరింత బలపరిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా, ఏ హీరోతోనైనా సినిమా చేయగల దమ్ము రాజమౌళికి ఉంది. ప్రస్తుతం ఒక ఊహాజనిత చారిత్రకంగా బాహుబలిని తీస్తున్న రాజమౌళికి త్వరలోనే అద్భుతమైన చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే రుద్రమదేవి కథతో గుణశేఖర్, శాతకర్ణి కథతో క్రిష్ సినిమాలు బుక్ చేసేసుకున్నారు. ఈ రెండూ తెలుగువారికి సుపరిచితమైన కథలు. రాజమౌళి మాత్రం, జాతీయ స్థాయిలో సామ్రాట్ అశోక సినిమాను డైరెక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మంగళవారం నేషనల్ అవార్డ్ తీసుకున్న తర్వాత మీడియాతో ముచ్చటించిన రాజమౌళి, తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సామ్రాట్ అశోక లేదా మహారాణా ప్రతాప్ సినిమాల్ని దేశవ్యాప్తంగా ఆదరణ లభించే విధంగా తెరకెక్కించాలని ఉందంటున్నాడు దర్శక జక్కన్న. బాహుబలి 2 పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా ఉంటుంది. ఆ తర్వాతి ప్రాజెక్టే అశోకుడి మీద తెరకెక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో..!