Read more!

English | Telugu

రజనీ స్టామినాకు కబాలీ మంచి ఎగ్జాంపుల్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా గురించి జనాలు మాట్లాడుకుని చాలా కాలమైపోయింది. పదేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి, ఆరేళ్ల క్రితం వచ్చిన రోబో, ఇవి తప్పితే సూపర్ స్టార్ బాక్సాఫీస్ ప్రభంజనం గత దశాబ్దకాలంలో ఏమాత్రం కనిపించలేదు. శివాజీ సినిమా టీవీల్లోనూ యూట్యూబ్ లోనూ బాగానే హిట్టయ్యింది కానీ కలెక్షన్ల దగ్గర యావరేజ్ గానే మిగిలిపోయింది. విక్రమసింహ, లింగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. కానీ లేటెస్ట్ గా తన కబాలీ సినిమాతో బాక్సాఫీస్ భాషా మళ్లీ జూలు విదిల్చినట్టే కనబడుతున్నాడు. ఇన్నాళ్లూ రజనీ మార్క్ మ్యానరిజాన్ని మిస్సవుతున్న ఆయన ఫ్యాన్స్ కు, కబాలీ టీజర్ తో ఈ సినిమా ఫుల్లు మీల్స్ లా ఉంటుందనే ఫీలింగ్ ను కల్గించాడు. అదే రిజల్ట్ టీజర్ వ్యూస్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో రిలీజైన 24 గంటల్లో అత్యధికంగా చూసిన టీజర్ గా కబాలీ యూట్యూబ్ ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే తమిళ టీజర్ కోటి వ్యూస్ కు చేరిపోయింది. ఇన్నాళ్లూ ఇక రజనీ కెపాసిటీ అయిపోయింది, సినిమాలు హిట్టవడం కష్టమే అన్న జనాలే రజనీ స్టైల్ ఎవర్ గ్రీన్ అంటూ పొగడటం విశేషం. రజనీ స్టామినాతో కబాలీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఆశ్చర్యం లేదు..!