Read more!

English | Telugu

పవన్ పొలిటికల్ స్పీచ్ లు రాసేది త్రివిక్రమేనా..?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్. ఇండస్ట్రీ హిట్స్ కొట్టే కెపాసిటీ ఉన్న నటుడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ స్టార్స్ అందరూ పొలిటికల్ గా హిట్టవుతారా..? సినిమాల్లో డైలాగులు చెప్పినంత ఈజీగా వేల లక్షల మంది ముందు స్పీచ్ లు దంచగలరా..? ఈ ప్రశ్నకు నో అనే ఆన్సరే వస్తుంది. పవన్ జనసేన పెట్టిన తర్వాత ఇచ్చిన స్పీచ్ లు విన్న ప్రతీ ఒక్కరూ అన్నది ఒకే మాట. ఈ డైలాగ్స్ పవన్ సొంతంగా మాట్లాడుతున్నవి కాదు. వెనకాల త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది అని. కానీ చాలాసార్లు ఈ విషయాన్ని ఖండించాడు పవన్. నేను ఒకళ్లు రాసిన డైలాగులు ఎందుకు చెప్తాను..? ప్రతీ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ముందు, త్రివిక్రమ్ వచ్చి నాకు రాసివ్వలేడు కదా అంటూ రిప్లై ఇచ్చాడు. పవన్ మాటలు విన్న తర్వాత అందరూ ఆయన చెప్పింది కూడా కరెక్టేలే అనుకున్నారు. కానీ అ ఆ ఆడియో ఫంక్షన్లో, మళ్లీ పాత డౌట్లన్నీ తిరిగి సీన్లోకి వచ్చేశాయి. పవన్ కు మైక్ ఇచ్చే ముందు త్రివిక్రమ్ పవర్ స్టార్ గురించిన వర్ణనతో పాటు, ఆయన తో నడుద్దాం వస్తారా..కూడా ఉంటారా అంటూ అభిమానుల్ని, టీవీల ముందు చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భమే మళ్లీ పాత డౌట్స్ ను తిరగతోడుతోంది. స్పీచ్ లో ఆవేశం పవన్ దే అయినప్పటికీ, ఆ మాటల వెనుక ఆలోచన త్రివిక్రమ్ దే అని చాలా మంది అభిప్రాయం. అయినా, వేరే వారితో స్పీచ్ రాయించుకోవడంలో తప్పేమీ లేదు. ఎంతో మంది గొప్ప నాయకులు స్పీచ్ లు రాయించుకున్నవారే. కాకపోతే పవన్ త్రివిక్రమ్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లయిన కారణంగానే, జనాలకు ఈ ప్రత్యేక ఆసక్తి..