English | Telugu

రెహమాన్ బయోగ్రఫీ ఏప్రెల్ 6 విడుదల

రెహమాన్ బయోగ్రఫీ ఏప్రెల్ 6 విడుదల కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ జీవిత చరిత్రను నస్రీన్ మున్షీ అనే వ్యక్తి చాలా చిన్న చిన్న డిటైల్స్ తోనూ, అత్యంత అరుదైన రెహమాన్ ఫొటోలతోనూ, రెహమాన్ అరుదైన ఇంటర్వ్యూలరోనూ చాలా ఆసక్తికరంగా వ్రాయటం జరిగిందని తెలిసింది. ఈ విషయమై రెహమాన్ కూడా చాలా సంతృప్తిని వ్యక్తపరిచారట. ఇలాంటి బయోగ్రఫీని ఏప్రెల్ ఆరవ తేదీన చెన్నైలో జరిపే ఒక సభలో విడుదల చేయనున్నారు.

ఈ బయోగ్రఫీని తనలోని ప్రతిభను గమనించి తనకు తొలి సినీ అవకాశాన్ని ఇచ్చి, తన సినీ జీవితానికి పునాది వేసిన గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం చేతుల మీదుగా తన బయోగ్రఫీని ఆవిష్కరింపజేసి మార్కెట్లోకి విడుదల చేయాలని రెహమాన్ సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికెదిగినా తన సంగీత జీవితానికి పునాది వేసిన మణిరత్నం గారిని మరచిపోకుండా ఆయన చేతుల మీదుగా తన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం ఎదిగినా ఒదిగే ఉన్న రెహమాన్ గొప్పతనం. ఈ పుస్తకాన్ని ఓం బుక్ ఇంటర్నేషనల్‍ సంస్థ వారు పబ్లిష్ చేస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.