English | Telugu

'రభస' ఆడియోలో కన్నీరు పెట్టుకున్న డైరెక్టర్

జూనియర్ ఎన్టీఆర్ 'రభస' ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. అందుకు కారణం కూడా ఆయన వివరించాడు. 'రభస' షూటింగ్ టైంలో నాకు జాండిస్ వచ్చాయి. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నాకు కోసం ఎదురుచుశాడు. నీకేం కాదు. నువ్వు ముందు కోలుకో.. నీకు నేను అండగా నేనున్నానంటూ ఎన్టీఆర్ నాకు ధైర్యం చెప్పారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. భావోద్వేగానికి గురైన సంతోష్ శ్రీనివాస్ ను ఎన్టీఆర్ ఓదార్చాడు. నేను ఎప్పటికీ ఎన్టీఆర్ కి రుణపడి వుంటానని శ్రీనివాస్ అన్నాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.