English | Telugu

ప్రేమించాలి అంటే ఏంటి?

తమిళంలో సూపర్ హిట్టయిన "అదలాల్ కాదల్ సేవియర్" చిత్రాన్ని తెలుగులో "ప్రేమించాలి" పేరుతో డబ్బింగ్ చేసారు. సురేష్ కొండేటి నిర్మించిన ఈ చిత్రానికి సుశీంధ్రన్ దర్శకత్వం వహించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దామా...!

చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఓ గ్రూప్ ఫ్రెండ్స్. ఆ గ్రూప్ లోని కార్తీక్(సంతోష్), అదే గ్రూప్ లోని శ్వేత(మనీషా యాదవ్)తో ప్రేమలో పడతాడు. తన ప్రేమను ఓ రోజు శ్వేతకి చెబుతాడు. మొదట శ్వేత నో అని చెప్పినా కూడా.. తర్వాత కార్తీక్ ను ప్రేమించడం మొదలు పెడుతుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతారు. అనుకోకుండా మనసులతో పాటుగా ఓసారి వాళ్ళ కోరికలను కంట్రోల్ చేసుకోకుండా శారీరక సంబంధం పెట్టుకొని చెయ్యకూడని తప్పుడు పని చేస్తారు. దాంతో శ్వేతకు ప్రేగ్నేన్సి వస్తుంది. సీన్ కట్ చేస్తే... ఈ విషయం పెద్దవాళ్ళకు తెలుస్తుంది. మరి ఈ పెద్దవాళ్ళు వీళ్ళని ఏం చేసారు? పెళ్లి చేసారా లేక ఇంట్లో నుండి తరిమేసారా? చివరకు కార్తీక్, శ్వేతలు ఏం చేసారు? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

ముందుగా కథ చాలా బాగుంది. దర్శకుడు చాలా మంచి మెసేజ్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటూనే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ సినిమా మొత్తం తమిళ వాసనే కొడుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో మరి కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది.

చివరగా... ప్రేమ అనే పదాన్ని వాడుకొని తప్పుడు పనులు చేస్తున్న, పెడదారి పడుతున్న యువతకు మంచి సందేశం ఈ సినిమా. పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి మెసేజ్ గా భావించవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.