English | Telugu

ప్రభాస్ కొత్త సినిమా లాంచ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'కల్కి'(Kalki)తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ఇప్పటికే 'రాజా సాబ్' (Raja Saab) షూటింగ్ 40 శాతం పూర్తి చేశాడు. ఆగష్టు 2 నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. మరోవైపు ఆగష్టులోనే మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు ప్రభాస్.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఆగష్టు 17న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుందట. అంతేకాదు ఆగష్టు 24 నుంచి షూట్ కూడా స్టార్ట్ కానుందని వినికిడి.

నిజానికి ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుందనే న్యూస్ విని.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వాలి. కానీ ఈ న్యూస్ విని, ప్రభాస్ ఫ్యాన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. మూవీ లాంచ్ కి ప్రభాస్ వచ్చేలా ఉంటేనే ఈవెంట్ చేయండని, లేదంటే అసలు అక్కర్లేదని అంటున్నారు. 'రాజా సాబ్' అనౌన్స్ మెంట్ టైంలో నిర్వహించిన ఈవెంట్ కి ప్రభాస్ రాలేదు. అందుకే ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు.

ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే.. ముందు 'స్పిరిట్' పూర్తి చేసి, ఆ తర్వాత 'ఫౌజీ' చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ లో 'రాజా సాబ్' 24వ సినిమా. ఆ తర్వాత చేసేది 25వ సినిమా అవుతుంది. అందుకే ల్యాండ్ మార్క్ మూవీగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో 'స్పిరిట్' లాంటి మాస్ బొమ్మ పడితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరికొందరు మాత్రం 25 సినిమాని హను రాఘవపూడితో చేయడమే కరెక్ట్ అని, ప్రభాస్ కెరీర్ లో క్లాసిక్ ఫిల్మ్ ని అందిస్తాడని అభిప్రాయపడుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.