English | Telugu

లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ప్రభాస్‌.. ఈ సినిమా ఎప్పుడంటే..!

ప్రస్తుతం ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ సంచలనం సృష్టిస్తోంది. 2016లో ఎవియల్‌ పేరుతో రూపొందిన ఓ సినిమాను నాలుగు షార్ట్‌ ఫిలింస్‌తో నిర్మించారు. ఇందులో ఓ షార్ట్‌ ఫిలింను డైరెక్ట్‌ చెయ్యడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌. ఈ సినిమా తర్వాత సందీప్‌కిషన్‌ హీరోగా తమిళంలో రూపొందించిన మానగరం చిత్రంతో దర్శకుడుగా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ప్రారంభించి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా కార్తీతో ఖైదీ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో లింక్‌ అవుతూ వచ్చిన సినిమాలు కమల్‌హాసన్‌ విక్రమ్‌, విజయ్‌ లియో. ఇప్పటివరకు లోకేష్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలు అరడజను మాత్రమే. కానీ, ఎన్నో సినిమాలు చేస్తే వచ్చే కీర్తి ప్రతిష్టలు ఈ అరడజను సినిమాలతోనే అతనికి లభించడం విశేషం.

లోకేష్‌ డైరెక్షన్‌లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినిమా కూలీ నిర్మాణం జరుపుకుంటోంది. అలాగే లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోని ఖైదీ2, విక్రమ్‌2 చిత్రాలు కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు రోలెక్స్‌ అనే ఓ డిఫరెంట్‌ మూవీ కూడా అతని చేతిలో ఉంది. వచ్చే ఏడాది ఖైదీ 2 రిలీజ్‌ కాబోతోంది. దీని తర్వాత రోలెక్స్‌ విడుదల కానుంది. లొకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఎంతో మంది స్టార్స్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అందరి కంటే బలంగా ప్రభాస్‌ పేరు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. లోకేష్‌ యూనివర్స్‌లోని ప్రాజెక్ట్‌ల గురించి ప్రభాస్‌తో చర్చలు జరిగాయని తెలుస్తోంది. లోకేష్‌ చెప్పిన కథ ప్రభాస్‌కి విపరీతంగా నచ్చిందట. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో చేయడం తనకెంతో హ్యాపీగా ఉందని సన్నిహితులతో లోకేష్‌ చెప్పాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో 2026 వరకు బిజీగా ఉంటారు ప్రభాస్‌. ఆ తర్వాతే లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. లోకేష్‌ సినిమాలు, ప్రభాస్‌ సినిమాలు పూర్తయ్యే వరకు ఆగుతారా లేక మధ్యలోనే ఈ ప్రాజెక్ట్‌ మొదలవుతుందా అనేది తెలియాల్సి ఉంది. లోకేష్‌ కనకరాజ్‌ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌కి ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌కి ఒక సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ అభిమానులకు ఇది ఒక గుడ్‌ న్యూస్‌ అనే చెప్పొచ్చు. ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.