English | Telugu

'మనంసైతం' ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం  

'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా 'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' సంస్థ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ''ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవ‌రికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండ‌గ రోజున ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల డాక్ట‌ర్ల‌తో క‌లిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వ‌హించాము. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్రామానికి శ్రీకారం చుట్టాము. గత 10 సంవ‌త్స‌రాలలో 50 వేల మంది నిస్సాహ‌యుల‌కు మా ఫౌండేషన్ నుంచి సాయం అందించాం. అలాగే సపర్య వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం, అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. 'మనంసైతం' అండ‌గా ఉంటుంది'' అని కాదంబ‌రి కిర‌ణ్ హామీ ఇచ్చారు.

న‌టుడు వినోద్‌బాల‌ మాట్లాడుతూ.. మనంసైతం కాదంబ‌రి ఫౌండేష‌న్ ‌నుంచి కాదంబ‌రి కిర‌ణ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. ఆయ‌న టీంలో మేము కూడా ఇలా సేవ‌ల్లో పాలుపంచుకోవ‌డం అదృష్టంగా భావిస్తాం. చిత్ర‌పురి కాల‌నీలోని కార్మికుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డం నిజంగా సంతోషంగా ఉంది. అని అన్నారు.

మనంసైతం సేవ య‌జ్ఞంలో తాము కూడా నిరంతరం పాలుపంచుకుంటామ‌ని కస్తూరి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో LIG వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులూ,ప‌లువురు న‌టీన‌టులు, వివిధ శాఖల సినీ కార్మికులు పాల్గొన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం