English | Telugu

పవన్ కళ్యాణ్ లెంగ్త్ పెంచేశారు

టాలీవుడ్ లో రూపొందుతున్న మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల. ఈ సినిమాలో మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమే అని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి వున్న క్రేజ్ దృష్ట్యా ఆయన పాత్ర నిడివి ఇంకాస్త పెంచాలని భావించారట. దాదాపు 15 నిమిషాలు పెంచి మొత్తంగా 45 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.