English | Telugu
పవన్ సినిమా కోసం భారీ సెట్
Updated : May 27, 2012
పవన్ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న "కెమెరా మేన్ గంగతో రాంబాబు" అనే చిత్రం కోసం ఈ భారీ సెట్ ను వేయిస్తున్నారు. హైదరాబాద్ సారథీ స్టుడియోలో ఈ భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్ గా నటించనుందట.
ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజ హీరోగా "దేవుడు చేసిన మనుషులు" చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచే చాలా చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ హీరోగా నటించే "కెమెరా మేన్ గంగతో రాంబాబు" చిత్రానికి పూరీ జగన్నాథ అదర్శకత్వం వహిస్తారు.