English | Telugu

పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు.. మెడల్ అందించిన క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ 

తెలుగు చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సినిమాల్లో తనకంటూ ఒక మార్కుని సృష్టించుకున్న పవన్  ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన కంటూ ఒక ప్రత్యేక మార్కుని క్రియేట్ చేసుకొని ఒక అరుదైన ఘనతని సాధించాడు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ,పంచాయితీ రాజ్, గ్రామీణాభి వృద్ధి, అటవీ శాఖ మంత్రిగా పవన్  ప్రజలకు తన వంతు సేవ అందిస్తూ వస్తున్నారు. ఆ విధంగా బాధ్యతలు తీసుకున్న వంద రోజుల లోపే ఒక సరికొత్త రికార్డు ని అందుకున్నాడు.అగస్ట్ 23 న స్వర్ణ గ్రామ పంచాయితీ పేరిట 13 ,326 గ్రామ పంచాయితీలకు ఒకే సారి గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా నాలుగువేల ఐదు వందల కోట్ల ఉపాధి హామీ పనులకి తీర్మానాలు కూడా చేసాడు..దీంతో ఒకే రోజు ఆ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డు యూనియన్ తమ రికార్డ్స్ లో నమోదు చేసింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డు మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్  రికార్డు పత్రాన్ని,మెడల్ ని పవన్ కళ్యాణ్ కి అందచేశారు. వరదల వల్ల నష్టపోయిన ఏపిలోని పంచాయితీలకు కూడా పవన్ విరాళాన్ని ఇచ్చిన  విషయం తెలిసిందే.