English | Telugu

ఎన్టీఆర్ తమిళనాడు వెళ్లి వాళ్ళని కలవనున్నాడా!

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ఇంకా కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది.ఇప్పటికే ఓవర్సీస్ లో నలభై ఐదు వేల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అయిపోయాయంటే దేవర క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే సునామి అనే పదం కూడా తక్కువ అవుతుందేమో.ఇక రిలీజ్ లో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ(koratala siva),ఎన్టీఆర్ కాంబోలో వస్తుండంతో అందరిలో భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ ఉండటంతో దేవర  సాధించబోయే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఇప్పటినుంచే లెక్కలు వేస్తున్నారు. 

 తమిళంలో దేవర ప్రమోషన్స్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఆడియో లాంచ్ వేడుకను భారీ ఎత్తున చెన్నైలో నిర్వహించేందుకు  యూనిట్ రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్త తమిళనాట ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తుంది.ఆర్ఆర్ ఆర్ ఈవెంట్ ని చెన్నై లో చేసినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా అందరకి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తో పాటు చిత్ర బృందం పాల్గొనబోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పీచ్ ఎలా ఉంటుందనే అభిమానుల్లో ఉంది.

ఇక ఎప్పటిలాగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం  ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ  చిత్ర యూనిట్ మాత్రం భారీగా తరలి వచ్చే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇండోర్ లో ఆ ఈవెంట్ ని జరిపే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ అప్ డేట్ గురించి కూడా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవర మొదటి పార్టులోనే ఇద్దరు ఎన్టీఆర్ లు సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోబోతుండగా జాన్వీ కపూర్ కధానాయకిగా చేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ లో చేస్తున్నాడు.