English | Telugu

నాలుగు రోజుల ముందే ‘ఓజీ’ సందడి.. ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్స్‌ రచ్చ!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఓజీ’ సెప్టెంబర్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చాలా గ్యాప్‌ తర్వాత విడుదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఒక రేంజ్‌లో హైప్‌ వచ్చింది. కానీ, దానికి ఎన్నో రెట్లు హైప్‌ ‘ఓజీ’ చిత్రానికి ఎక్కువగా ఉంది. సినిమా రిలీజ్‌కి ఇంకా నాలుగు రోజులు టైమ్‌ ఉన్నప్పటికీ ఆదివారమే ఈ సినిమాకి సంబంధించిన సందడి మొదలైపోయింది. ‘ఓజి కాన్సర్ట్‌’ పేరుతో సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఒక స్టేడియంనే బుక్‌ చేశారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచే ఎల్‌ బి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. ఓజీ బ్యాండ్స్‌ తలకి కట్టుకున్న ఫ్యాన్స్‌ వేలాదిగా తరలి వస్తున్నారు. కొందరు ఎర్ర కండువాలతో కనిపిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌లో 90 శాతం యూత్‌ ఉంటారు. స్టేడియం మొత్తం యూత్‌తోనే నిండిపోయేలా కనిపిస్తోంది. క్రమంగా స్టేడియం నిండుతోంది. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్‌ పవన్‌కళ్యాణ్‌కి జేజేలు పలుకుతూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ అక్కడి వాతావరణాన్ని ఎంతో ఉత్సాహవంతంగా మారుస్తున్నారు ఫ్యాన్స్‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.