English | Telugu

అక్టోబర్ నుంచి 'గబ్బర్ సింగ్ 2'..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త. గత కొంత కాలంగా పవన్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆరు నూరైనా 'గబ్బర్ సింగ్ 2' షూటింగ్ ను అక్టోబర్ నుంచి మొదలుపెట్టాలని పవన్ నిర్ణయించాడట. ఈ సినిమాకి దర్శకత్వం కూడా సంపత్ నందినే చేస్తున్నాడట. కొద్ది రోజుల క్రితం సంపత్ నంది స్థానంలో హరీష్ శంకర్ ను దర్శకుడిగా పెట్టారని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ కి మాత్రం ఈ సినిమా దర్శకుడిని మార్చలన్న ఆలోచనే లేదట. ఈ రూమర్ ఎవరు ముందు పుట్టించారు అన్నది ఆరా తీస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల'చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.