English | Telugu

'పటాస్' యూజర్ రివ్యూ

గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతోన్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌, ఈ సంవత్సరం మొదటి నెలలోనే హిట్ కోసం బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాడు. ‘అతనొక్కడే’తో సురేందర్‌ రెడ్డిని ఇంట్రడ్యూస్‌ చేసిన కళ్యాణ్‌ రామ్‌ ఇప్పుడు అనిల్‌ రావిపూడితో మరో దర్శకుడిని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే.. 'పటాస్'లో కళ్యాణ్ రామ్ తనలోని కొత్త నటనను బయటపెట్టాడు. విలన్‌ని ఢీకొట్టే సీన్స్‌లోనే కాకుండా కామెడీతోనూ అభిమానులను బాగా ఆకట్టుకున్నాడు. అలాగే దర్శకుడు అనిల్‌ రావిపూడి తన మామూలు కథని వినోదాత్మకంగా చెప్పడంలో సక్సెస్‌ అయ్యాడు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కామెడీ అని చెప్పవచ్చు. శ్రీనివాసరెడ్డి తన అద్భుతమైన టైమింగ్‌తో ప్రేక్షకులను బాగా అలరించాడు. వినోదం ఎక్కడా మిస్‌ అవకపోవడం, కథనం వేగంగా పరుగులు తీయడం దీనికి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. అలాగే నందమూరి అభిమానులకి కావాల్సిన అంశాలని కూడా అనిల్‌ రావిపూడి మర్చిపోకుండా జోడించాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.