English | Telugu

బీరువా రివ్యూ

సందీప్‌ కిషన్‌, సురభి జంటగా కణ్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘బీరువా’ శుక్రవారం నాడు విడుదలైంది.

సంజు (సందీప్ కిషన్)కి బీరువా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ నాన్న ఎప్పుడు అతన్ని కొట్టాలని ప్రయత్నించినా బీరువాలో దాక్కుంటూ వుంటాడు. అతనికి, బీరువాకి ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది. సంజు చాలా అల్లరివాడు. తండ్రి నరేష్. బిజినెస్ మాన్. ఒక బిజినెస్ డీల్‌లో 40 కోట్లు మోసపోతాడు. ఆ 40 కోట్లు ఇప్పించాలని విజయవాడకి వెళ్ళి ఎంపీ సాంబశివరావు సహాయం అర్ధిస్తారు. మంచోడైన సాంబశివరావు మా ఇంట్లోనే వుండండి.. ఆ 40 కోట్లు ఇప్పించాక వెళ్లండి అంటాడు. అయితే సంజు అక్కడ సురభిని చూస్తాడు. గతంలోనే సురభిని ఎక్కడో చూసి ఇష్టపడతాడు. ఇప్పుడు ఇక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. ఎంపీ సాంబశివరావు 40 కోట్లు వీళ్ళకి తిరిగి ఇప్పిస్తాడు. ఆడబ్బు తీసుకుని తిరిగి వాళ్ళ ఊరు వెళ్తూ వెళ్తూ సురభిని కూడా కారు డిక్కీలో పెట్టుకుని ఎత్తుకొస్తాడు సంజు.

మరోవైపు అజయ్ ఒక రాజకీయ నాయకుడు.. ఎమ్మెల్యే అవుదామని అనుకుంటూ వుంటాడు. దానికోసం విజయవాడ ఎంపీ సాంబశివరావు అతని కూతురు సురభి. రాజకీయంగా ఎదుగుదామని అనుకునే అజయ్‌కి సాంబశివరావు కూతురితో పెళ్ళి కుదురుతుంది. అజయ్‌కి ముందే వేరే అమ్మాయితో సంబంధం వుంటుంది. ఆమె కొనుక్కున్న కొత్త బీరువా ఇంటికి వచ్చినప్పుడు తెరిస్తే అందులో హీరో వుంటాడు. బీరువాలో ఎందుకు వున్నావని ఆమె సంజును అడిగితే సంజు చెప్పే ఫ్లాష్‌బ్యాకే ఈ సినిమా కథ. అసలు సంజు ఆ బీరువాలోకి ఎలా వెళ్ళాడు? హీరోయిన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? హీరోయిన్ సంజుని ప్రేమిస్తుందా.. చివరికి ఏమైందనేది ‘బీరువా’ సినిమా.

‘బీరువా’ సినిమా మామూలు లవ్ స్టోరీతో రూపొందించిన సినిమా. అయితే దర్శకుడు కన్మణి ‘బీరువా’ అనే ఎలిమెంట్‌ని తెలివిగా కథలో చొప్పించాడు.సినిమాలోని ప్రతి మలుపులో బీరువా కనిపిస్తుంది. కాకపోతే అది ఒకే బీరువా కాదు.. రకరకాల బీరువాలు. హీరో విలన్ల నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ తెలివిగా బీరువాని వాడుకుంటాడు.

సినిమా ప్రథమార్థం అంతా ఫన్నీ ఎలిమెంట్స్‌తో జరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేయడంతో క్లైమాక్స్ స్టార్టవుతుంది. ఆ తర్వాత ద్వితీయార్థం మొత్తం ఛేజ్‌లతో నడుస్తుంది. మొత్తమ్మీద ద్వితీయార్థం మొత్తం క్లైమాక్స్ అని చెప్పొచ్చు. విలన్ గ్యాంగుల నుంచి హీరో తప్పించుకునే సందర్భంలో ఛేజింగ్స్ వుంటాయి. కథంతా ఫస్టాఫ్‌లోనే నడుస్తుంది. కాబట్టి డైరెక్టర్ ఇంకేమీ చేయలేక సెకండాఫ్‌లో సప్తగిరి అనే పాత్రని తెచ్చాడు. సప్తగిరి మొదట నవ్వించి తర్వాత బోర్ కొట్టించాడు. ఇంటర్వెల్ తర్వాత అరగంటలో అయిపోవాల్సిన సినిమా సాగుతుంది. టైటిల్ని జస్టిఫై చేయడం కోసం వందల కొద్ది బీరువాలు చూపించాడు డైరెక్టర్.

బీరువా అనే టైటిల్ విని థ్రిల్లర్ సినిమా అనుకున్నారు చాలామంది. నిజానికి కథలో ఆ అవకాశం కూడా వుంది. కానీ డైరెక్టర్ వినోదాన్నే నమ్ముకున్నాడు. సందీప్ కిషన్, నరేష్, సప్తగిరి, షకలక శంకర్ కామెడీని పండించారు. కొన్ని పంచ్‌లు పేలాయి. సినిమాని బాగా సాగదీశాశారని అనిపిస్తుంది. సెకండాఫ్ అంతా కథని నడిపించడానికి ఏదో ఒక సీన్ పెట్టి కాలక్షేపం చేశారు. దాంతో మన సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది.

ఈమధ్య కొత్త కథ అని చెప్పి ప్రతి డైరెక్టర్ పాత కథనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఈ సినిమా కూడా అంతే. విలన్ ఇంట్లో హీరో గారడీ. అజయ్ విలన్ పాత్ర బలంగా లేకపోవడంతో సినిమా తేలిపోయినట్టయింది. మామూలు కథని కొత్త స్క్రీన్‌ప్లేలో ప్రెజెంట్ చేయాలని అనుకున్నాడు డైరెక్టర్. అయితే కథలో దమ్ము లేకపోవడంతో సినిమా తేలిపోయింది.

సందీప్ కిషన్ యాక్షన్ చాలాచోట్ల ఎక్కువైనట్టు అనిపించింది. కొన్నిచోట్ల ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. అతని మేనరిజమ్స్, డైలాగ్స్ చాలామంది హీరోలను గుర్తుచేస్తుంది. హీరోయిన్ సురభి బాగుందిగానీ ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ పలకలేదు. నరేష్‌ది ముఖ్యమైన పాత్ర. ఆయన బాగా చేశాడు. సంగీత దర్శకుడు తమన్ ఆర్.ఆర్. బాగానే వున్నా. పాటలు ఒక్కటీ హాల్ దాటాక గుర్తుండవు. ఎక్కువ మార్కులు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడుకి పడతాయి. సినిమా మొత్తాన్ని రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించాడు. మొదటి పాట అయితే ఎంతో రిచ్‌గా పెద్ద సినిమా చూస్తున్న ఫీల్‌ని అందిస్తుంది. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలసి నిర్మించిన ఈ సినిమాలో కథకు ఎంత కావాలో అంతే ఖర్చుపెట్టారు.

పంచ్ లైన్: బోర్ బీరువా

రేటింగ్: 2.5/5

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.