Read more!

English | Telugu

కొడుకులతో ఫోటోలు దిగిన సల్మాన్ ఖాన్..!

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తెరపై చేసే హడావిడి వేరు. స్క్రీన్ పై ఫైటింగ్స్, పంచ్ డైలాగ్స్ తో చెలరేగి పోయే సల్మాన్ బయట చాలా కూల్ పెర్సన్ అని చెబుతారు దగ్గరినుంచి చూసిన వారందరు. పెళ్లి చేసుకోనప్పటికీ, తన కుటుంబానికి మాత్రం చాలా విలువ ఇస్తాడు సల్మాన్. ముఖ్యంగా అన్నదమ్ములతోనూ, తల్లిదండ్రులతోనూ చాలా సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా అర్భజ్, సొహైల్ పిల్లలు అర్హాన్, నిర్మాణ్ లతో సరదగా టైం గడపడమే కాక, ఫోటోలు కూడా దిగాడు సల్లూ భాయ్. ఆయన కేవలం సినిమాలే కాక బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ అనేది ఒక బ్రాండ్ గా మారింది. ఈ బ్రాండ్ లో ఇఫ్పుడు టీనేజ్ పిల్లలకు డ్రస్సెస్ ప్రవేశపెడుతున్నాడు సల్మాన్. దీనికి ప్రమోషన్ కోసం అర్హాన్‌, నిర్వాణ్‌లతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు సల్లూ భాయ్. సోఫాలో కూర్చుని, సల్లూతో పాటు పిల్లలిద్దరూ నవ్వుకునే స్టైల్ లో ఫోటో ఉంది. కాగా సల్మాన్ ప్రస్తుతం సుల్తాన్ పైనే దృష్టి పెట్టాడు. రెజ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకోసం, సల్మాన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం విశేషం.