Read more!

English | Telugu

రాష్ట్రపతి భవన్‌లో రాజమౌళికి చప్పట్ల వర్షం..!

బాహుబలితో తెలుగు సినిమా స్టామినా ఎంటో ప్రపంచానికి చూపించారు రాజమౌళి. తెలుగు సినిమా అంటే నాలుగు ఫైట్లు, కామెడీ, ఆరు పాటలు అన్న మచ్చను చెరిపేశాడు దర్శకధీరుడు. రాజమౌళి ప్రతిభను, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయన్ను గౌరవించింది. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి పేరు వినిపించిన దగ్గర నుంచి ఆయన రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకునే వరకు హాల్ మొత్తం చప్పట్లతో హోరెత్తిపోయింది. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, రజినీ కాంత్, రామోజీరావు తదితరులు చప్పట్లతో రాజమౌళిని అభినందించారు. ప్రణబ్‌కి నమస్కరించిన రాజమౌళి తన అవార్డును అందుకున్నారు.