Read more!

English | Telugu

వాట్సాప్ గ్రూప్ లో కత్రినాను తొలగించారట..!

కత్రినా కైఫ్ కు రణ్ బీర్ కు కటీఫ్ అయిపోయినా, మళ్లీ వాళ్లిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు కలుస్తారని బాలీవుడ్ జనాలు భావించారు. కానీ రీసెంట్ గా జరిగిన విషయం బట్టి చూస్తే, ఇద్దరూ తమ గతాన్ని మర్చిపోయి జీవితం ముందుకు సాగిపోవాలనుకుంటున్నారని అర్ధమవుతుంది. తాజాగా వీళ్లిద్దరికి సంబంధించి బాలీవుడ్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. కపూర్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్ ఉందట. రణ్ బీర్ తో పెయిర్ అప్ అయిన తర్వాత కత్రినాను ఈ గ్రూప్ లో యాక్సెప్ట్ చేశారు. ఇన్నాళ్లూ వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారనే థాట్ తో ఇప్పటి వరకూ ఆమెను గ్రూప్ నుంచి తొలగించలేదు. కానీ తాజాగా గ్రూప్ అడ్మిన్ గా ఉన్న రణ్ బీర్ అత్త రీతూ నందా, కత్రినాను తొలగించిందట.

ఇన్నాళ్లూ ఈ గ్రూప్ కు దూరంగా రిషీ కపూర్, కత్రినాను తొలగించిన తర్వాత గ్రూప్ లోకి యాడ్ అయ్యాడట. దీంతో వీళ్లిద్దరి బ్రేకప్ పరిపూర్ణమైందంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. నిజానికి 2016 చివర్లో కత్రినాను పెళ్లి చేసుకుంటానని రణ్ బీర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక్కడే ఇద్దరి మధ్యా విభేదాలొచ్చాయట. కాస్త సెటిల్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దామని కత్రినా అంటుంటే, రణ్ బీర్ మాత్రం ఇక సినిమాలు వద్దు అంటున్నాడట. ఈ విషయమై ఇద్దరి మధ్యా విభేదాలు బ్రేకప్ వరకూ దారితీశాయి. రణ్ బీర్ తల్లిదండ్రులకు కూడా కత్రినా తమ కోడలిగా ఇష్టం లేదనే పుకారు కూడా ఉంది. తాజా న్యూస్ తో వాళ్ల బ్రేకప్ కన్ఫామ్ అయిపోయింది.