Read more!

English | Telugu

' ఊపిరి ' ఫస్ట్ రివ్యూ (ప్రీ రిలీజ్)

క్యాస్టింగ్            : నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ
స్క్రీన్ ప్లే, డైరెక్షన్   : వంశీ పైడిపల్లి
సంగీతం            : గోపీ సుందర్
నిర్మాణం            : పివిపి సినిమా

నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమా ఊపిరి. ట్రైలర్లతో ఇప్పటికే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఊపిరి మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మూవీ టీం, వీలైనంత పబ్లిసిటీతో తెలుగు తమిళ ఇండస్ట్రీలో పాపులారిటీ తీసుకొచ్చేశారు. ట్రైలర్ బట్టి ఫీల్ గుడ్ గా తెరకెక్కి ఉంటుందనే ఫీలింగ్ కలుగుతున్న ఊపిరి, ది ఇంటచిబుల్స్ అనే ఫ్రెంచి మూవీకి రీమేక్. కామెడీ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఇంటచిబుల్స్ ఫ్రాన్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. మరి అలాంటి సినిమాను తెలుగులో ఎలా తెరకెక్కించి ఉంటారో ఓ లుక్కేద్దాం రండి..

జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండే నాగార్జున పాత్రకు, ఒక కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి నడుము కింది భాగమంతా చచ్చుబడిపోతుంది. ఇలాంటి పాత్రకు నాగార్జున లాంటి స్టార్ ఒప్పుకోవడం సాహసంగానే చెప్పాలి. దొంగతనం కేసులో జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చిన ఒక ఆవారా కుర్రాడి పాత్రలో కార్తీ కనిపిస్తాడు. కుర్చీకే పరిమితమైపోయిన తన జీవితాన్ని కాస్త ఆసక్తికరంగా మార్చే మనిషిని తనకు కేరింగ్ అసిస్టెంట్ గా పెట్టుకోవాలనుకుంటారు నాగార్జున. కార్తీలోని సరదా వ్యక్తిత్వం ఆయనకు నచ్చి, అతన్ని అప్పాయింట్ చేసుకుంటాడు.

కార్తీ జైలుకెళ్లి వచ్చాడని తెలిసినా, స్నేహితుడు(ప్రకాష్ రాజ్) వద్దని చెప్పినా నాగార్జున మాత్రం కార్తీని వదలడు. ఇద్దరికీ అన్నదమ్ముల్లాంటి బంధం ఏర్పడుతుంది. అలాంటిది ఒక సందర్భంలో కార్తీకి నాగార్జునను విడిచి వెళ్లిపోవాల్సి సందర్భం ఏర్పడుతుంది. అలా విడిపోయిన వాళ్లిద్దరూ, తిరిగి ఎలా కలుస్తారు అనే ఎమోషనల్ డ్రామానే బ్యాలెన్స్ కథ. మాతృకలో బిలియనీర్ అసిస్టెంట్ పాత్రకు చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. కానీ ఊపిరిలో తమన్నా పాత్రను మాత్రం మన నేటివిటీకి తగ్గట్టుగా హీరోయిన్ గా, కార్తీతో ప్రేమలో పడే పాత్రగా మలిచారు వంశీ పైడిపల్లి.

కామెడీతో పాటు, సెంటిమెంట్ కు పుష్కలంగా స్కోప్ ఉన్న కథ ఇది. బృందావనం, ఎవడు సినిమాల్లో వంశీలోని ఎమోషనల్ డైరెక్టర్ ఎలా ఉంటాడో కనిపిస్తుంది. ఎమోషన్స్ పండించడం వంశీ బలం. అందుకే ఊపిరిని కూడా అదే విధంగా ఎక్కడా ఫీల్ ను కోల్పోకుండా తెరకెక్కించి ఉంటారనే అనుకోవచ్చు. ఫ్రెంచి సినిమాలో, బిలియనీర్ కు ఒక అమ్మాయితో ప్రేమ చిగురించడం, దానికి ఆనందిస్తూ కార్తీ పాత్ర వెళ్లిపోవడం దగ్గర కథ ముగుస్తుంది. మరి తెలుగు సినిమాకు ఎలాంటి ఎండింగ్ ఇచ్చారనేది ఆసక్తికరం.

నిర్మాణపరంగా క్వాలిటీ ఎలా ఉందో ట్రైలర్లో అర్ధమవుతూనే ఉంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది పివిపి బ్యానర్. గోపీ సుందర్ అందించిన స్వరాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో, వంశీ పైడిపల్లి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా ఉండబోతున్నాయో  స్క్రీన్ మీద తేలనుంది.

ఓవరాల్ గా మాతృకను చూసిన తర్వాత ఊపిరి ట్రైలర్ చూస్తే, వంశీ పైడిపల్లి ఇంటచిబుల్స్ ను ఇండియా నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా మార్చాడనే ఫీలింగ్ కలగకమానదు. సినిమా పై పూర్తి రివ్యూ కోసం మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే..