Read more!

English | Telugu

హోలీపై వర్మ కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్..!

వర్మ ట్విట్టర్ ఫాలో అయ్యేవాళ్లకు ఆయన శైలి కరెక్ట్ గా అర్ధమవుతుంది. ఏ సమయంలోనైనా, ఎక్కడున్నా, ఆయనకు ఏదైనా అనిపిస్తే చాలు వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేసేస్తాడు. అది కరెక్టా కాదా లాంటి విషయాలన్నీ తర్వాత. ముందు తనపై డిస్కషన్ జరగాలి. అదే ఆయనకు ఇష్టం. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ మీద పడ్డ వర్మ గాలి, ఈసారి కొద్దిగా డైరెక్షన్ మార్చి హోలీ పండగవైపు మళ్లింది. ఎవర్ని ఎవరు చంపారో తెలియకుండా హోలీని సెలబ్రేట్ చేసేసుకుంటాం. కానీ భంగును తాగడానికి హోలీని మించిన సందర్భం ఏముంటుంది. హోలీలో సంతోషకరమైన విషయం ఏంటంటే, పెద్దల ఎదురుగానే, వాళ్ల అనుమతితోనే అమ్మాయిల్ని తడి బట్టల అందాల్ని చూడచ్చు. చెంపదెబ్బ తినకుండానే వాళ్లను తాకచ్చు అంటూ వర్మ గారు ట్వీటేశారు.

దీంతో వర్మపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు మొదలైపోయాయి. అమ్మాయిలపై వర్మ సెక్సిస్ట్ కామెంట్స్ అంటూ చాలా మంది వర్మను తిట్టిపోస్తున్నారు. వర్మ ట్వీట్ లో, సెలబ్రేషన్స్ పేరుతో చాలా మంది చేసే వికృత చేష్టలపై సెటైర్ ఉన్నట్టు కూడా అనిపిస్తోంది అంటూ ఇంకొంతమంది పాజిటివ్ గా మాట్లాడటం విశేషం.