English | Telugu
గుసగుసలు అందరికీ నచ్చుతున్నాయి
Updated : Jun 25, 2014
ఊహలు గుసగుసలాడే చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణాలతో పాటు ఓవర్‌సీస్ లోను మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్ ఆడియెన్స్ తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చూసి అభినందించారు. హీరో నానీ, దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి తదితరలు ఈ చిత్ర ప్రివ్యూ చూసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కూడా ఈ చిత్రం చూసిన వారిలో వున్నారు. ఇక తాజాగా ఊహల గుసగసలను చూసి అభినందించిన వారి లిస్టులో టాలీవుడ్ సింగర్స్ కూడా చేరారు.
లో బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఆడియెన్స్, ఇండస్ట్రీ ఇలా ఆదరించడం చూసి యూనిట్ ఎంతో సంబరపడుతోంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. వారాహి బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు.