English | Telugu

సినీనటుడు నూతన్ ప్రసాద్ మృతి

సినీనటుడు నూతన్ ప్రసాద్ మృతి చెందారు. మార్చ్ 30 వ తేదీన ఉదయం నూతన్ ప్రసాద్ ఆరోగ్యం విషమించటంతో, నూతన్ ప్రసాద్ ను ఆసుపత్రికి తరలిస్తూండగా, నూతన్ ప్రసాద్ మరణించారు. నూతన్ ప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యమతో బాధపడుతున్నారు. నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10 వ తేదీన జన్మించారు.

ఆయన రంగస్థలం మీద నటుడిగా మంచి పేరు గడించి, అనంతరం "చలిచీమలు" చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. బాపుగారు దర్శకత్వంలో వచ్చిన "అందాల రాముడు" చిత్రంలో నూతన్ ప్రసాద్ కమర్షియల్ సినిమాల్లో ప్రవేశించటం జరిగింది. బాపు గారి దర్శకత్వంలోని "ముత్యాల ముగ్గు" చిత్రం ద్వారా నూతన్ ప్రసాద్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆయనకు 1984 లో తొలి సారి నంది అవార్డు లభించింది. 2005 లో యన్ టి ఆర్ జాతీయ పురస్కారం లభించింది.

నూతన్ ప్రసాద్ "బామ్మమాట-బంగారు బాట" చిత్రంలో కారులో పై నుండి కిందపడిన కారణంగా నూతన్ ప్రసాద్ నడుం భాగం పనిచేయటం మానేసింది. అప్పటి నుండీ నూతన్ ప్రసాద్ వీల్ చైర్ లోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. నూతన్ ప్రసాద్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నూతన్ ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నూతన్ ప్రసాద్ కుటుంబానికి తెలుగువన్ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూంది.