English | Telugu
అల్లు శిరీష్ 'సత్తా' చూపిస్తాడా?
Updated : Jun 11, 2015
పూరీ స్కూల్ నుంచి వచ్చిన మంచి డైరక్టర్ పరుశురామ్. మంచి మాటల రచయిత కూడా. చిన్న సినిమాలు చేసినపుడు బాగానే వున్నాడు. కానీ రవితేజ తో సారొచ్చారు అంటూ పెద్ద సినిమా చేసి దారుణంగా దెబ్బతిన్నాడు. అంతే అక్కడి నుంచి మళ్లీ సినిమా లేదు. ఆఖరికి ఇప్పుడు ఓ ఆఫర్ దక్కించుకున్నాడు.
కొత్త జంట తరువాత సరైన సినిమా చేద్దామని చూస్తున అల్లు శిరీష్ తో ఓ సబ్జెక్ట్ ఓకె చేయించుకున్నాడు. ఇది సోలో సినిమా టైపులో వుంటుందట. ఈ సినిమాను ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు సమాచారం. మరీ ఈ సినిమాతోనైన అల్లు శిరీష్ హీరోగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాడో లేదో?