English | Telugu

ఎన్టీఆర్ పాట‌.. ప‌వ‌న్ సినిమాలో??

గోపాల గోపాల ఆల్బ‌మ్‌లో మూడే మూడు పాట‌లు వినిపించాయి. అందులో భాజే, భాజే.. బాగా పాపుల‌ర్ అవుతోంది. ఆడియో రిలీజ్ కంటే ముందుగానే ఈ పాట‌ని అభిమానుల కోసం విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఈ పాట‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ ట్యూన్ గోపాల గోపాల కోసం క‌ట్టింది కాద‌ట‌. టెంప‌ర్ కోసం చేసుకొన్న ట్యూన్ అట‌. అటు టెంప‌ర్‌కీ, ఇటు గోపాల గోపాల‌కీ అనూప్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. గోపాల గోపాల కంటే ముందే టెంప‌ర్ ట్యూన్లు సిద్ద‌మ‌య్యాయి. అందులో భాజే భాజే ఒక‌టి. దానికి లిరిక్స్ కూడా రాయించుకొన్నాడట అనూప్‌. కానీ ఆ ట్యూన్ టెంప‌ర్ కి సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో పూరి ప‌క్క‌న పెట్టేశాడు. గోపాల గోపాల‌లో సెట్యువేష‌న్ కుద‌ర‌డంతో అదే ట్యూన్ ని లిరిక్స్ మార్చి వాడుకొన్నార‌ట‌. ఆ పాటే ప‌వ‌న్‌కి విప‌రీతంగా న‌చ్చి.. అనూప్‌కి త‌న మ‌రుస‌టి సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు ప‌వ‌న్‌. ఒక‌రు కాద‌న్న పాట‌.. మ‌రో సినిమాలో హిట్ట‌యిపోయి సంగీత ద‌ర్శ‌కుడికి విప‌రీత‌మైన పేరు వ‌చ్చేయ‌డం విచిత్రంగా ఉంది కదూ.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.