English | Telugu

కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేసిన ఎన్టీఆర్.. ఇదెక్కడి ఛేంజ్ రా మావ!

తెలుగులో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ముఖ్యంగా ఆయనకు మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా మాస్ అవతార్ లోనే కనిపించే ఆయన.. అప్పుడప్పుడు స్టైలిష్ గా కనిపించి సర్ ప్రైజ్ చేస్తుంటారు. పాత్రకి తగ్గట్లుగా సినిమా సినిమాకి తన లుక్ లో వైవిధ్యం చూపించే ఎన్టీఆర్.. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎంత స్టైలిష్ గా కనిపించారో తెలిసిందే. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ ట్రెండ్ సెట్ చేసింది. అలా అప్పుడప్పుడు తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకునే ఎన్టీఆర్ మరోసారి సర్ ప్రైజ్ చేశారు.

సినిమాకి తగ్గట్లుగా మేకోవర్ ఛేంజ్ చేసుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'దేవర' కోసం ఊర మాస్ అవతార్ లో కనిపించనున్నారు. అదే సమయంలో తాజాగా ఒక యాడ్ కోసం పూర్తి స్టైలిష్ గా మారి సర్ ప్రైజ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తో తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి బడా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక్కో యాడ్ కోసం ఆరు నుంచి పది కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనను బ్రాండ్ అంబాజిడర్ గా చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఆయన మరో యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ ఆలిం హకీం సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ని పంచుకున్నారు. తక్కువ సమయంలో లుక్స్ పరంగా ఇంతటి వైవిధ్యం చూపించడం ఎన్టీఆర్ కే సాధ్యమవుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.