English | Telugu

ఎన్టీఆర్ వాటికే ఫిక్స్ అవుతాడా?

ఒకప్పుడు తొడలు కొట్టుకుని, పెద్ద డైలాగులతో, గాలిలోకి సుమోలు ఎగరటం, అడ్డంగా నరికేసుకోవడం వంటివి ఉంటే ఆ సినిమా సూపర్ హిట్టయ్యేది. ఎన్టీఆర్ సినిమా అంటే ఇది మాములే. కానీ ప్రతిసారి అలాంటి సినిమాలే తీస్తే జనాలకు చిరాకు వస్తుంది.అదే ఇపుడు ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారింది. "సింహాద్రి" చిత్రం నుండి ఇప్పటి రామయ్యా వస్తావయ్యా చిత్రం వరకు రొటీన్ యాక్షన్ చిత్రాలే చేస్తూ వచ్చాడు. అందువల్లే ఎన్టీఆర్ తాజా చిత్రం రామయ్యా వస్తావయ్యా కు కలెక్షన్లు లేకుండా పోతున్నాయి.మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ తన మూస ధోరణిని మార్చుకొని, కొంచెం కొత్తగా కనిపిస్తే తప్ప ఎన్టీఆర్ కు మరో బాక్సాఫీస్ హిట్టు దొరికే ఛాన్స్ లేనట్లుగా ఉందని తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం "రభస" కోసమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.