English | Telugu

స్టుడియోNలో ntr మ్యారేజ్ లైవ్ టెలికాస్ట్

స్టుడియోN లో ntr మ్యారేజ్ లైవ్ టెలికాస్ట్ చేస్తారని తెలిసింది. ntr మ్యారేజ్ మే నెల అయిదవ తేదీన హైదరాబాద్ లో జరుగనుంది. స్టుడియోNలో ntr మ్యారేజ్ ని లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


నిజానికి స్టుడియోN టి.వి. ntr కాబోయే మామ నార్నే శ్రీనివాస్ కి చెందినది కాగా దాన్ని మొన్నామధ్య ఆయన అమ్మేశారని వినపడింది. కానీ తన కూతురి మ్యారేజ్ ntr తో జరుగుతున్నందున స్టుడియోNలో ntr మ్యారేజ్ లైవ్ టెలికాస్ట్ చేయించటానికి ఆయన నిశ్చయించారట. అయితే ntr మ్యారేజ్ హైదరాబాద్ లో ఎక్కడనేది ఇంకా తెలియలేదు. బహుశా హైటెక్స్ లోనే ntr మ్యారేజ్ కూడా జరుగవచ్చని సమాచారం. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజ్ "మా"టి వి లో లైవ్ టెలికాస్ట్ అయిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

అందుకని అల్లు అర్జున్ కన్నా తన కాబోయే అల్లుడు ntr ప్రేస్టేజ్ ఇంకా పెరగాలని, ntr మ్యారేజ్ ఇంకా ఘనంగా జరపాలని, స్టుడియోNలో ntr మ్యారేజ్ లైవ్ టెలికాస్ట్ చేయించాలని నార్నే శ్రీనివాస్ నిర్ణయించినట్లు సమాచారం. కనుక రాష్ట్రం నలుమూలల ఉన్న ntr అభిమానులూ, బాలయ్య అభిమానులూ, నందమూరి అభిమానులూ స్టుడియోNలో ntr మ్యారేజ్ లైవ్ టెలికాస్ట్ లో హ్యాపీగా చూడవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.