English | Telugu

బాలనటిగా నిత్య మీనన్

బాలనటిగా నిత్య మీనన్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో నాని హీరోగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో యువనిర్మాత దాము నిర్మించిన "అలా మొదలైంది" సినిమా ద్వారా ప్రవేశించిన మళయాళ పొట్టి కుట్టి నిత్య మీనన్ బాలనటిగానే సినీ పరిశ్రమలోకి వచ్చింది. టబు, జావేద్ జఫ్రి నటించగా, ఫ్రెడ్ దర్శకత్వంలో నిర్మించిన "హనుమాన్" అనే బాలీవుడ్ చిత్రంలో నిత్య మీనన్ బాలనటిగా నటించింది.

ప్రస్తుతం "అష్టాచమ్మా, భీమిలీ కబడ్డీ జట్టు, అలామొదలైంది" చిత్రాల ఫేం నాని హీరోగా, అంజనా ఆలీ ఖాన్ దర్శకత్వంలో, తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన విభిన్నకథా చిత్రం "సెగ" లో కూడా నిత్య మీనన్ హీరోయిన్ గా నటిమచింది. ఈ "సెగ" చిత్రం జూలై 29 వ తేదీన విడుదల కాబోతూంది. బాలనటిగా నిత్య మీనన్ ని చూసే అవకాశం తెలుగువన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.