English | Telugu

వీరధీరశూర పార్ట్ 2 ఓటిటి డేట్ ఇదే 

చియాన్ విక్రమ్(Vikram)తంగలాన్' లాంటి యాక్షన్ అడ్వెంచర్ మూవీ తర్వాత 'వీరధీరశూర పార్ట్ 2(Veera Dheera Soora)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27 న రిలీజ్ కాగా తెలుగుతో పాటు తమిళంలోను బాగుందనే టాక్ ని తెచ్చుకుంది. విక్రమ్ సరసన దుషారా విజయన్(Dushara Vijayan)జత కట్టగా ఎస్ జె సూర్య,(sj Surya)థర్టీ ఇయర్స్ పృథ్వీ, సూరజ్ వెంజరమోడు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్దమయ్యింది. ఏప్రిల్ 24 నుంచి 'అమెజాన్ ప్రైమ్' వేదికగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా ప్రకటించడంతో ఓటిటి మూవీ లవర్స్ కి సరికొత్త పండుగ వచ్చినట్లయింది. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియాషిబు, షిబు తామీన్స్ 'వీరధీరశూర పార్ట్ 2 'ని నిర్మించగా 'ఎస్ యు అరుణ్ కుమార్' దర్శకుడుగా వ్యవహరించాడు. సుమారు 55 కోట్లరూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 65 కోట్లు దాకా వసూలు చేసింది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే రౌడీయిజాన్ని వదిలేసిన కాళీ తన భార్య బిడ్డలతో కలిసి ఒక చిన్న కిళ్ళీ షాప్ పెట్టుకొని ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కాని గతంలో ఎవరి దగ్గర అయితే పని చేసాడో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ గిరి ని చంపాలని చెప్తాడు. అందుకే కాళీ ఒప్పుకుంటాడు. పాత జీవితాన్ని వదిలేసిన కాళీ ఎందుకు అరుణ గిరి ని చంపటానికి ఒప్పుకున్నాడు? నిజంగానే ఎస్ పి ని చంపుతాడా? లేదా? అనేదే ఈ కథ. కాళీ క్యారక్టర్ లో విక్రమ్ మరోసారి తన కెరీర్ లో అత్యుత్తమ నటన కనపర్చాడు. అరుణ గిరి గా ఎస్ జె సూర్య కూడా ఏ మాత్రం ఎనర్జి తగ్గకుండా నటించాడు. ఈ మూవీకి పార్ట్ 1 కూడా ఉంది. మేకర్స్ ముందుగా పార్ట్ 1 రిలీజ్ చెయ్యకుండా పార్ట్ 2 రిలీజ్ చేసారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.