English | Telugu
పక్కలోకి వస్తే నాలుగు అవకాశాలు ఇస్తానని స్టార్ డైరెక్టర్ ఆఫర్ చేసాడు. ఆ డైరెక్టర్ ఇతనే
Updated : Nov 19, 2024
'ఈ మాయ పేరేమిటో' అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకి పరిచయమైన నటి కావ్య థాపర్(kavya thapar)ఆ తర్వాత 'ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ,ఈగల్,డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించి యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది.లేటెస్ట్ గా గోపిచంద్(gopi chand)హీరోగా శ్రీను వైట్ల(srinu vaitla)దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వం'(viswam)మూవీలో కూడా కావ్య థాపర్ నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి.
రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి రాక ముందు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కున్నాను.ఒక యాడ్ కోసం ఆడిషన్ కి వెళ్తే ఒక బడా దర్శకుడు నువ్వు యాడ్ కి సెలక్ట్ అవ్వాలంటే నా పక్కలోకి రావాలని, అలా చేస్తే ఇంకో నాలుగు యాడ్స్ కూడా రావడంతో పాటు ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పాడు.దాంతో నేను అలాంటి దాన్ని కాదని అక్కడ్నుంచి వచ్చేసాను.ఆ తర్వాత కూడా చాలా రోజులు ఫోన్లు చేసి విసిగించేవాడని చెప్పుకొచ్చింది.
కావ్య థాఫర్ చెప్పిన ఈ మాటలు ఇపుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి.కాకపోతే ఏ ఇండస్ట్రీ ని ఉద్దేశించి ఆ మాట చెప్పిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆమె రెండు తమిళ మూవీలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది.ముంబై కి చెందిన కావ్య థాఫర్ నటి కావడం తన తండ్రి 'కల' అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది.ఈ క్రమంలోనే తను కొంచం సెటిల్ అయ్యాక ఈ విషయాన్నీ బయటపెట్టిందనే మాటలు కూడా సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.