English | Telugu

‘నీదారే నీ కథ’ మూవీ టీజర్‌ లాంచ్‌! 

జె.వి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్‌ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్‌, అంజన, విజయ్‌, అనంత్‌, వేద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నీ దారే నీ కథ’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

నిర్మాత తేజేష్‌ మాట్లాడుతూ ‘ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మాకు బ్యాక్‌ బోన్‌ సపోర్ట్‌ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్‌. మాకు మొదటి సినిమా అయినా ఇంత సపోర్ట్‌ చేస్తున్నా ప్రింట్‌ మరియు టెలివిజన్‌ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు.

నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఈ సినిమాని నిర్మించాం. మంచి టెక్నికల్‌ వాల్యూస్‌తో మ్యూజిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్‌ ఆర్కెస్ట్రా థీమ్‌ సినిమాకి హైలైట్‌ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్‌ నుంచి అలెగ్జాండర్‌ మ్యూజిక్‌ ఆర్కెస్ట్రా బుడాపెస్ట్‌ ఆర్కెస్ట్రా గతంలో మిషన్‌ ఇంపాజిబుల్‌, పరసైట్‌, స్క్విడ్‌ గేమ్‌ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్‌ కి సంబంధించిన మ్యూజిషియన్స్‌ తో చాలా గ్రాండ్‌ గా చేసాం’ అన్నారు.

నిర్మాత, దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘నేను న్యూయార్క్‌లో డైరెక్షన్‌ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఎంతోమంది సింక్‌ సౌండ్‌ రిస్క్‌ అంటున్న సింక్‌ సౌండ్‌ తోనే ఎగ్జిక్యూట్‌ చేసి హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కి తగ్గకుండా చేశాం’ అన్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.