English | Telugu

లైసెన్స్ తీసుకున్న అల్లు అర్జున్..ఆర్మీ లేదు కాబట్టి రిలాక్స్ అయిన పోలీసులు 

తగ్గేదేలే అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన హీరో అల్లు అర్జున్. భారీ ఫ్యాన్ బేస్ కూడా బన్నీ సొంతం. అలాగే ఆయనకి సంబంధించిన న్యూస్ ఏదైనా రావాలే గాని నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

కొన్ని రోజుల క్రితం బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసాడు. ఈ రోజు అధికారుల నుంచి కబురు అందటంతో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్ళాడు. అధికారులు దగ్గర్నుండి మరి లైసెన్సు ని అందచేశారు. ఈ సమయంలో సిబ్బంది బన్నీతో ఫోటోలు దిగటానికి పోటీపడింది. అనంతరం అక్కడనుంచి వెళ్ళిపోయాడు.ఇక బన్నీ ఖైరతాబాద్ వస్తున్న ముందస్తు సమాచారం ఆర్మీ కి తెలియలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పోలీసులకి ఫుల్ పని ఉండేదనే మాటలు వినపడుతున్నాయి. పోలీసులు కూడా అదే మాట అనుకుంటున్నారు.బన్నీ తన ఫ్యాన్స్ ని ఆర్మీ అంటాడనే విషయం అందరకి తెలిసిందే.


ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. తన అభిమానులకి ఎలాగైనా మంచి హిట్ ని అందివ్వాలనే కసితో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే వైజాగ్ లో షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని వచ్చింది. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జట్ తో ఆ మూవీ రూపుదిద్దుకుంటుంది. పుష్ప పార్ట్ 1 కాంబోనే 2 కి రిపీట్ అవుతుంది. ఫ్యాన్స్ కి కూడా భారీ అంచనాలే ఉన్నాయి

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.