English | Telugu

తాగొచ్చి.. తంద‌నాలాడింది ఊర్వశి

చాలా ఏళ్ల‌క్రితం ఓ కాలేజీ ఫంక్ష‌న్‌కి తెలుగు హాస్య న‌టుడు హాజ‌ర‌య్యాడు. స్టేజీ ఎక్కే ముందే.. ఆయ‌న చుక్కేశారు. మైకు అందుకొని.. నోటికొచ్చింది వాగిప‌డేశాడు. తుళ్లుతూ.. తూగుతూ స్టేజీనీ ఊపేశాడు. ఆ త‌ర‌వాత ఆయ‌న‌పై అనేక విమ‌ర్శ‌లొచ్చాయి. ఇప్పుడూ సేమ్ టూ సేమ్ అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకొంది. ఈసారి స్టేజీ ఎక్కింది న‌టుడు కాదు. న‌టి. అందులోనూ... జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డు పొందిన తార‌. ఆమె ఎవ‌రో కాదు... ఊర్వ‌శి. ఇటీవ‌ల చెన్నైలో ఎల్.డి.ఎఫ్ సంస్థ‌ ఫీమేల్ లేజిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఊర్వశిని ఆహ్వానించింది. చెప్పిన టైం కంటే గంట ఆల‌స్యంగా వ‌చ్చిన ఊర్వ‌శి.. అప్ప‌టికే ఫుల్లుగా తాగేసింది. స్టేజీ ఎక్కి నానా హంగామా చేసింది. మైకు అందుకొని నోటికొచ్చిందంతా వాగింది. దాంతో కార్య‌క్ర‌మం కాస్త ర‌సాభ‌స‌గా మారింది. స్టేజీ దిగుతూ చుట్టుప‌క్క‌ల వాళ్ల‌పై కుళ్లు జోకులు వేసి.. అక్క‌డ‌కి వ‌చ్చిన‌వాళ్ల మ‌న‌సుల్నీ నొప్పించింద‌ట‌. ఊర్వ‌శికి ఏదో స‌ర్దిచెప్పి అక్క‌డి నుంచి పంపించే ప్ర‌య‌త్నం చేసింది క‌మిటీ. ఊర్వ‌శి నిర్వాకంపై తోటి న‌టీన‌టులు, కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా ఊర్వశి మ‌త్తు దిగిందో, లేదో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.