English | Telugu

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది.. తలెత్తుకోలేని పరిస్థితి


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మృణాల్ ఠాకూర్
ట్వీట్ లో ఏముంది!
ఆమెనే చేసిందా లేక ఫ్యాన్స్ చేసారా!
ధనుష్ రిప్లై ఇలా ఉండబోతుంది

మృణాల్ ఠాకూర్(Mrunal Thakur),ధనుష్(Dhanush)డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే డేటింగ్ కపుల్ కాస్తా పెళ్లితో రియల్ కపుల్ గా మారబోతున్నారనే న్యూస్ కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రూమర్ గానే చెలామణి అవుతున్నా మృణాల్, ధనుష్ స్పందించకపోవడంతో సదరు న్యూస్ విజయ గర్వంతో చెలామణి అవుతు ఉంది. దీంతో ఆ ఇద్దరి అభిమానులతో పాటు నెటిజన్స్ తమకి ఇష్టమొచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. అలాంటి ఈ టైంలో మృణాల్ చేసినట్టుగా చెప్తున్నట్వీట్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం.


గత కొన్ని రోజులుగా నా ప్రేమ, పెళ్లి పై ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి. ఒక అమ్మాయి పర్సనల్ లైఫ్ పై ఎందుకు రూమర్స్ ని సృష్టిస్తారో అర్ధం కావడం లేదు. సదరు రూమర్స్ పై ఇన్ని రోజులు స్పందించలేదంటే ఏదో దాచి పెడుతున్నట్లు కాదు. వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం ఇష్టం లేక. కానీ ఇప్పుడు ఆ రూమర్స్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ధనుష్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. మా మధ్య గౌరవం, ప్రొఫెషనలిజం మాత్రమే ఉన్నాయి.అంతకు మించి ఇంకేం లేవు అని చెప్పింది.ఇప్పుడు ఈ మాటలతో రూమర్స్ కి సోషల్ మీడియాలో తలెత్తుకోలేని పరిస్థితి.

Also read: ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

ఒకసారి మృణాల్ ట్విట్టర్ పేజీ ని చూస్తే ఆమె ఫ్యాన్ పేజీ నుంచి సదరు ట్వీట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత మాత్రాన ఆమె చెయ్యలేదని అర్ధం కాదు. డైరెక్ట్ గా ట్వీట్ చేయకుండా తన టీం వైపు నుంచి చేయించిందని అర్ధం చేసుకోవచ్చు. మృణాల్అంతలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ధనుష్ , మృణాల్ కలిసి ఇంతవరకు ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ ఆ ఇద్దరు కలిసి కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యారు. ఆ టైంనుంచే డేటింగ్, పెళ్లి పుకార్లకి టైం వచ్చినట్లయింది. మృణాల్ అప్ కమింగ్ సినీ కెరీర్ ని గమనిస్తే డెకాయిట్ అనే తెలుగు మూవీతో పాటు ధో దివాన్ షెహర్ మైన్ అనే హిందీ చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. డెకాయిట్ మార్చి 19 న రిలీజ్ కానుండగా ధో దివాన్ షెహర్ మైన్ ఈ నెల 20 న రిలీజ్ కానుంది.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం