English | Telugu
"నాలుగేళ్ళలో మోక్షజ్ఞ హీరో" బాలయ్య
Updated : Jan 10, 2012
"నాలుగేళ్ళలో మోక్షజ్ఞ హీరో" అని బాలయ్య అన్నారు. ఇటీవల బాలయ్య కృష్ణా జిల్లా టూర్ కి వెళ్ళారు. ఆయన కృష్ణాజిల్లాలోని ఘంటసాల గ్రామంలో తన తండ్రిగారు విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ప్రజలు, అభిమానులు "మోక్షజ్ఞ ఎప్పుడు హీరో అవుతాడు" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగేళ్ళలో మోక్షజ్ఞ హీరోగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తాడని అన్నారు.
తాను 2014 ఎన్నికల్లో యమ్.యల్.ఎ.గా నిలబడతాననీ, ఆ విధంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవచేస్తాననీ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చినా, తాను సినిమాలను వదలననీ, సినిమాల్లో హీరోగా నటిస్తూనే ఉంటాననీ అన్నారు.