English | Telugu

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం!

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్దమైందా అంటే అవుననే అనిపిస్తోంది. మొన్నటివరకు కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ సడెన్ గా స్లిమ్ గా మారి స్టైలిష్ లుక్ లో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. హీరో మెటీరియల్, నందమూరి హ్యాండ్సమ్ హంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన డెబ్యూ మూవీ ఆ దర్శకుడితో ఉంటుంది, ఈ దర్శకుడితో ఉంటుందంటూ గతంలో రకరకాల పేర్లు వినిపించాయి. బాలకృష్ణ సైతం 'ఆదిత్య 369' సీక్వెల్ తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని భావించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మోక్షజ్ఞ బొద్దుగా మారిన ఫోటోలు చూసి, అసలు అతనికి సినిమాలపై ఆసక్తి ఉందా? అనే అనుమానులు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటికీ తన న్యూ లుక్ తో చెక్ పెట్టాడు మోక్షజ్ఞ. చాలా తక్కువ టైంలోనే స్లిమ్ గా, ఫిట్ గా తయారయ్యాడు. తాజా ఫోటోలలో అందంగా, పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లా కనిపిస్తున్నాడు. దీంతో మోక్షజ్ఞ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. మోక్షజ్ఞ న్యూ లుక్ చూసి, అతని ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు అతని మొదటి సినిమా దర్శకుడు ఎవరనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేస్తాడో చూడాలి.