English | Telugu
బాలయ్య రేర్ రికార్డ్.. చిరు టచ్ చేస్తాడా!
Updated : Oct 13, 2023
సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకోబుతున్నారు. యూఎస్ లో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ హీరోగా అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నారు. గత రెండు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు 'భగవంత్ కేసరి'తో మరోసారి ఆ ఫీట్ సాధించడానికి సిద్ధమయ్యారు.
బాలకృష్ణకి రికార్డులు కొత్త కాదు. అప్పట్లో తెలుగునాట ఎన్నో సంచలన రికార్డులు సృష్టించారు. అయితే ఇప్పుడు యూఎస్ మార్కెట్ లోనూ సత్తా చాటుతున్నారు. తన గత రెండు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి' యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఆయన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి' కూడా వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమైంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న స్పందన చూస్తుంటే మొదటి రోజే యూఎస్ లో 600k డాలర్స్ రాబట్టేలా ఉంది. ఈ లెక్కన ఫస్ట్ వీకెండ్ లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉంది.
సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎవరూ ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించలేదు. యూఎస్ లో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న తొలి తెలుగు సీనియర్ స్టార్ గా బాలయ్య నిలవనున్నాడు. గతంలో చిరు రెండు సార్లు ఈ రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 'ఖైదీ నెం.150', 'సైరా నరసింహా రెడ్డి'తో యూఎస్ లో అదిరిపోయే వసూళ్లు రాబట్టిన చిరు.. ఆచార్యతో నిరాశపరిచారు. అలాగే 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య'తో మరోసారి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన చిరంజీవి.. భోళా శంకర్ తో మరోసారి నిరాశపరిచారు. ఇలా రెండుసార్లు హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. రాబోయే సినిమాలతోనైనా ఈ ఫీట్ సాధిస్తారేమో చూడాలి.