English | Telugu

సెల్ఫీ కోసం వచ్చిన ఫ్యాన్‌ని ఒక్కటి పీకాడు.. ఎవరా అగ్రనటుడు?

సినిమా తారలంటే జనంలో ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. వారిని సినిమాల్లో చూసి ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యే అభిమానులు తమకు నచ్చిన నటుడు ఎదురుగా కనిపిస్తే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వారితో మాట్లాడాలని, సెల్ఫీలు దిగాలని తెగ ముచ్చటపడిపోతూ ఉంటారు. అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ విషయంలో హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. హీరోల విషయం ఎలా ఉన్నా, హీరోయిన్ల విషయంలో ఇది చాలా దారుణంగా ఉంటుంది. అందుకే పబ్లిక్‌లోకి రావాలంటే హీరోయిన్లు భయపడుతుంటారు. జనంలోకి వచ్చిన హీరోయిన్లతో అభిమానులు అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక హీరోల విషయానికి వస్తే కొంతమంది అభిమానుల తాకిడి తట్టుకోలేక చేయి చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి.తాజాగా అటువంటి ఘటనే బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ విషయంలో జరిగింది.

ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన నానా పటేకర్‌ కొంత విరామం తర్వాత మళ్ళీ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న తన తదుపరి సినిమా షూటింగ్‌ కోసం హాజరయ్యాడు నానా. షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. ఓ అభిమాని అతని దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా, అతని తలపై ఒక్కటి పీకాడు నానా. వెంటనే అతని సిబ్బంది ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో అందరూ నానా పటేకర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో అభిమానంగా దగ్గరికి వచ్చిన వ్యక్తి అలా కొట్టడం చాలా తప్పు అంటున్నారు. వివాదాలు నానా పటేకర్‌కి కొత్తేమీ కాదని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.