English | Telugu

‘ఓజి’ ఫంక్షన్‌లో నోరు జారిన థమన్‌... ఏకి పారేస్తున్న నెటిజన్లు!

ప్రస్తుతం సొసైటీలో ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే సెలబ్రిటీలకు గడ్డుకాలం దాపురించిందనే చెప్పాలి. ఏదైనా ఫంక్షన్‌కి రావడానికి, వేదికపై తమ మనసులోని మాటల్ని చెప్పడానికి, తమ ఆనందాన్ని నలుగురితో షేర్‌ చేసుకోవడానికి వీలు లేని వాతావరణం కనిపిస్తోంది. సోషల్‌ మీడియా బాగా పెరిగిపోవడం, చిన్న మాట తప్పుగా దొర్లినా క్షణాల్లో అది వైరల్‌గా మారి.. ఆ మాటలు అన్నవారి మెడకు చుట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో ఇలాంటి కాంట్రవర్సీలు టాలీవుడ్‌లో చాలా జరిగాయి. ఇప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ వంతు వచ్చింది.

పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఓజి’ చిత్రం సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ‘ఓజి కాన్సర్ట్‌’ పేరుతో సెప్టెంబర్‌ 21న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ఎంతో ఘనంగా జరిపారు. అయితే ఈ ఫంక్షన్‌ స్టార్ట్‌ అయిన కాసేపటికే వర్షం మొదలు కావడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఆ సమయంలోనే థమన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వర్షం మొదలైన కాసేపటికి వేదికపైకి వచ్చిన థమన్‌ ‘వర్షమా.. బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం’ అన్నాడు. ఇప్పుడీ మాట పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. సోషల్‌ మీడియాలో థమన్‌ని ఏకి పారేస్తున్నారు. వర్షాన్ని అంత తేలికగా తీసుకోవడం నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది.

‘కొన్నిచోట్ల వర్షం అనేది లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నీకు వర్షం అంటే అంత చిన్న చూపా..’, ‘ప్రకృతికి కోపం వస్తే.. ఎవరూ ఏం చెయ్యలేరు. ఈమధ్యకాలంలో ఎన్నో విపత్తులు జరిగాయి. దేన్నీ మనం ఆపలేం. వర్షాలు లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వర్షం మీద కామెంట్‌ చేయడం ఏమిటి?’, ‘నీ ఫంక్షన్‌ బాగా జరగాలని వర్షం అవసరం లేదు అంటున్నావు. కానీ, కోట్లాది మంది రైతులకు వర్షం చాలా అవసరం’.. నెటిజన్లు థమన్‌పై మండి పడుతున్నారు. ఫంక్షన్‌లో నోరు జారిన థమన్‌ ఇప్పుడు ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. తనపై జరుగుతున్న ఈ ట్రోలింగ్‌ గురించి థమన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. సెలబ్రిటీలు తమ నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని థమన్‌ మరోసారి ప్రూవ్‌ చేశాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.