English | Telugu

మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలు

తెలుగులో ఒకప్పుడు యన్.టి.ఆర్., ఎ.యన్.ఆర్., కృష్ణ, శోభన్ బాబులు మల్టీ స్టారర్ సినిమాల్లో నటించటానికి ఉత్సాహం చూపేవారు. జనం కూడా అలాంటి సినిమాలను బాగా ఆదరించేవారు. మిస్సమ్మ, గుండమ్మ కథ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, సత్యం శివం, వయ్యారి భామలు- వగలమారి భర్తలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే అవుతుంది. అలాంటి మల్టీ స్టారర్ చిత్రాలు ప్రస్తుతం కరువైపోయాయి.

కానీ ప్రస్తుతం యువరత్న నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ కుమార్ కలసి "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా...!" అనే చిత్రంలో నటిస్తూండగా, విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు కలసి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు" చిత్రంలో కలసి నటిస్తున్నారు. అలాగే "గౌరవం" అనే చిత్రంలో కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కలసి నటిస్తున్నారని తెలిసింది.

అంతే కాక వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ, తమిళ స్టార్ హీరో సూర్య కలసి నటిస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇది మన తెలుగు సినీ పరిశ్రమలో శుభపరిణామంగా భావించవచ్చు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.