Read more!

English | Telugu

ధోనీ కథకు ముగింపు ఎలా ఇద్దాం..?

బాలీవుడ్ లో బయోపిక్ లు కనకవర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తున్న నీర్జా యే అందుకు ఉదాహరణ. బయోపిక్స్ ఎఫెక్ట్ తోనే సల్మాన్ సుల్తాన్, అమీర్ దంగల్ బయోపిక్స్ తీస్తున్నారు. స్పోర్ట్స్ పర్సనాలిటీలైన, అజార్, సింధు, సానియా, పుల్లెల గోపీచంద్ లాంటి వారిపై కూడా సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటి మధ్యలోనూ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తోంది ధోనీ బయోపిక్. జీవిత చరిత్రతో సినిమా అంటే మాటలు కాదు. అందులోనూ ధోనీ లాంటి సెలబ్రిటీకైతే, ప్రతీ సీన్ నూ, అతని జీవితంతో పోల్చి చూస్తారు. అందుకే దర్శకుడు నీరజ్ పాండే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కాకపోతే ఇప్పుడు మూవీ టీం కి వచ్చిన పెద్ద సమస్య, సినిమాని ఎక్కడ ముగించాలి అని. ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాడు. వన్డేలు ట్వంటీలకు కూడా రేపో మాపో రిటైర్ మెంట్ ఇచ్చేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్నాళ్లు ఆగి ధోనీ పూర్తిగా రిటైరైన తర్వాత సంఘటనల్ని కలిపి తీద్దామా లేక 2011 వరల్డ్ కప్ విన్నింగ్ మొమెంట్స్ తో ముగిద్దామా అని ఆలోచిస్తున్నారట. కానీ పూర్తిగా రిటైరయ్యేవరకూ ఆగితే సినిమా చాలా లేట్ అయ్యే అవకాశం ఉండటంతో, 2011 ఫైనల్ తో సినిమాను ముగిస్తారని సమాచారం. ధోనీకే కాక, ఇండియాలోని క్రికెట్ అభిమానులందరికీ 2011 ఫైనల్ ఒక కల నిజమైన రోజు. ఆ ఫైనల్లో, విన్నింగ్ షాట్ గా ధోనీ సిక్స్ కొట్టడం విశేషం.