Read more!

English | Telugu

దీపికా పడుకునే బ్రాడ్ పిట్ తో చేస్తోందా..?

దీపికా పడుకునేకు అదృష్టం మామూలుగా పట్టలేదు. ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ హిట్స్ తో ఊపు మీదున్న ఈ అమ్మడు, xXx సినిమాతో హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో, హాలీవుడ్ సూపర్ స్టార్ విన్ డీజిల్ సరసన నటించబోతోంది దీపిక. తాజాగా హాలీవుడ్ సెక్సీయస్ట్ హీరో బ్రాడ్ పిట్ తో తన రెండో హాలీవుడ్ సినిమాను సైన్ చేసిందని సమాచారం. ఇదే నిజమైతే దీపికా దశ పూర్తిగా మారిపోయినట్టే. బ్రాడ్ పిట్ సరసన నటించడానికి హాలీవుడ్ భామలు సైతం ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది దీపికకు అవకాశం వస్తే అదృష్టమే. కాకపోతే, బ్రాడ్ పిట్ సినిమాల్లో చాలా ఘాటు సన్నివేశాలుంటాయి. మరి దీపిక వాటికి ఓకే చెబుతుందో లేదో చూడాలి.