Read more!

English | Telugu

హీరోయిన్ గజాలా పెళ్లికూతురైంది..!

మీకు గజాలా గర్తుందా..? ' నాలో ఉన్న ప్రేమ ' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంటరై వరసగా స్టార్స్ తో సినిమాలు చేసిన గజాలా ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని, విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసినా పూర్తి స్థాయి స్టార్ గా ఎదగలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా యాక్ట్ చేసిన గజాలా ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలతోనే సరిపెట్టుకుని పూర్తిగా కనుమరుగైంది. ఈ అమ్మడికి ఇప్పుడు పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. టీవీ యాక్టర్ ఫైజల్ ఖాన్ తో రేపు గజాలా పెళ్లి జరగబోతోంది. ముంబైలోని ఒక హోటల్ లో కేవలం సన్నిహితులు, స్నేహితుల్ని మాత్రమే పిలిచి, చాలా నిరాండంబరంగా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.