Read more!

English | Telugu

వీళ్ల సినిమా పేర్లే ఇంటి పేర్లు..!

కొంతమంది సినిమావాళ్ల అసలు పేర్లు మనకు తెలియవు. ఎందుకంటే సినిమా పేరు మీదే, వాళ్లకు పేరొచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ పేరు మీదే స్థిరపడిపోతుంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి నుంచి, దేవీ శ్రీ ప్రసాద్ వరకూ అలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి. కె. విశ్వనాథ్ తీసిన సిరివెన్నెల సినిమాతో, ఆయన పేరు సిరివెన్నెలగా మారింది

శుభలేఖ సుధాకర్

అసలు పేరు సురావజుల సుధాకర్. చిరంజీవితో కలిసి యాక్ట్ చేసిన శుభలేఖ సినిమా సక్సెస్ కావడంతో, ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది

మహర్షి రాఘవ

1987లో విడుదలైన మహర్షి సినిమా తర్వాత రాఘవ, మహర్షి రాఘవగా వాసికెక్కాడు.

అల్లరి నరేష్

అసలు పేరు ఈదర నరేష్. అల్లరి సినిమా నుంచి అల్లరి నరేష్ గా పేరొచ్చింది

ఆహుతి ప్రసాద్

అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆహుతి సినిమాలో నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు పేరు కూడా మారింది.

కళ్లు చిదంబరం

ఆయన నటించిన మొదటి సినిమా కళ్లు. అదే ఆయనకు ఇంటిపేరుగా మారింది

దేవి శ్రీ ప్రసాద్

అసలు పేరు ప్రసాద్. మొదటి సినిమా దేవి తో దేవి శ్రీ ప్రసాద్ గా పేరు మార్చుకున్నాడు.

దిల్ రాజు

అసలు పేరు వి. వెంకటరమణా రెడ్డి. దిల్ సినిమాతో నిర్మాతగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి దిల్ రాజుగా మారాడు.

సత్యం రాజేష్

అసలు పేరు రాజేష్. సత్యం సినిమాతో సత్యం రాజేష్ గా ఫ్యామస్ అయ్యాడు.

బొమ్మరిల్లు భాస్కర్

అసలు పేరు భాస్కరన్ నటరాజన్. మొదటి సినిమా బొమ్మరిల్లు సూపర్ హిట్ కావడంతో, బొమ్మరిల్లు భాస్కర్ గా స్థిరపడిపోయింది ఈ తమిళ డైరెక్టర్ పేరు.

షావుకారు జానకి

షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. విజయా ప్రొడక్షన్స్ తీసిన షావుకారు సినిమా తర్వాత ఆవిడ షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందింది.

సాక్షి రంగారావు

సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవజుల రంగారావు. 1967లో రిలీజైన తన మొదటి సినిమా సాక్షి పేరుతో సాక్షి రంగారావుగా ఆయనకు పేరు స్థిరపడింది

చిత్రం శ్రీను

పిల్లలమర్రి శ్రీనివాస్ కాస్తా, తన మొదటి సినిమా చిత్రంతో చిత్రం శ్రీనుగా మారిపోయాడు.

అదండీ విషయం. ఒక్క సినిమా హిట్టైతే అది జాతకాన్నే కాదు, ఇంటి పేరును కూడా మార్చేస్తుంది మరి..