Read more!

English | Telugu

హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్న కొరటాల, ఎన్టీఆర్..


జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఇద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం జనతా గ్యారెజ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఇద్దరూ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.

 

 

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన టెంపర్ సినిమా హిట్టయింది. ఆ తరువాత సుకుమార్  తో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న జనతా గ్యారేజ్ సినిమాతో మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

 

 

ఇక కొరటాల శివ.. మిర్చి సినిమాతో ప్రభాస్ కు మంచి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టడమే కాదు.. సూపర్ హిట్ ను అందించారు. ఇక శ్రీమంతుడు సినిమా అయితే ప్రస్తుతం ఉన్న సినిమాలకి కొత్త ఒరడిని తీసుకొచ్చారు. అది రికార్డులు సొంతం చేసుకోవడమే కాదు.. అందులో ఊరి దత్తత కాన్సెప్ట్ కూడా బాగా క్లిక్కయింది. ఆ సినిమా స్ఫూర్తితోనే మహేశ్ ఏపీలో, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా కూడా హిట్ ట్రాక్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 

మరి అటు ఎన్టీఆర్.. ఇటు కొరటాల ఇద్దరూ హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నవేళ వీరిద్దరూ కలిసి చేస్తున్న జనతా గ్యారేజ్ కూడా హిట్టవ్వాలని కోరుకుందాం.