Read more!

English | Telugu

నారా రోహిత్ ' రాజా చెయ్యి వేస్తే ' టీజర్ టాక్

వరస సినిమాలతో, వారం తర్వాత వారం థియేటర్లపై దండయాత్ర చేస్తున్నాడు నారారోహిత్. ఇప్పటికే తుంటరితో ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన నారా కుర్రోడికి, రెండో ఎగ్జామ్ సావిత్రి ఏప్రిల్ 1న ఉంది. ఆ హడావిడి ముగిసే లోపే మళ్లీ రాజా చెయ్యి వేస్తే అంటూ వస్తానంటున్నాడు. ఇలా వరస సినిమాలతో, టాలీవుడ్ లో బిజియస్ట్ హీరోగా మారిపోయాడు. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవిల సినిమాలు ఇలా వారం, వారం గ్యాప్ లో వచ్చిన సందర్భాలున్నాయి. ఈ తరం హీరోల్లో నారా రోహిత్ కు మాత్రమే ఈ క్రెడిట్ దక్కింది.

లేటెస్ట్ గా రిలీజైన రాజా చెయ్యి వేస్తే టీజర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. తారకరత్న విలన్ గా చేసిన ఈ సినిమా టీజర్ కు సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా ఉంది. విలన్ గా తారకరత్న లుక్స్, వైట్ డ్రస్ లో బుల్లెట్ పై నారారోహిత్ వస్తున్న విజువల్స్, షాట్స్ క్వాలిటీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. గోల్డెన్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తుండగా, కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నాడు. రోహిత్ సరసన ఇషా తల్వార్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెల 25న విజయవాడలో భారీ ఎత్తున ఆడియో రిలీజ్ ప్లాన్ చేశారు రాజా టీం. ఆడియోకు బాలయ్య, చంద్రబాబు ప్రత్యేక అతిథులుగా రానుండటం విశేషం.