English | Telugu

రౌడీకి ఏ సర్టిఫికేట్

మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "రౌడీ'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు "A" సర్టిఫికేట్ ఇచ్చారు. ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్ బాబు సరసన జయసుధ, విష్ణు సరసన శాన్వి నటించారు. ఈ సినిమాను మొదటిరోజు షోను మహిళా ప్రేక్షకులకి ప్రత్యేకంగా వేసి చూపిస్తామని మోహన్ బాబు అన్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పార్థసారధి, గజేంద్ర, విజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.